నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో సైబర్ నేరాలపై అవగాహన
రిపోర్టర్: మహేష్
స్థలం: నాయుడుపేట
నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థులు మరియు మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల నివారణ, పోక్సో చట్టం, రహదారి భద్రతా నిబంధనలతో పాటు మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే తీవ్ర అనర్థాలపై పోలీసు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు అంశాలపై అవగాహన పెంపొందించుకున్నారు.