స్వచ్ఛాంధ్ర స్వర్ణ రథం వేళ పారిశుద్ధ్య శ్రమదానంతో కపిలేశ్వరవనం కాలువ శుభ్రత

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం తిరుపతి ఎన్జీవో కాలనీలోని మాల్వాడిగుండం కాలువను శుభ్రం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జేబీ శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తదితరులు శ్రమదానంలో పాల్గొని కాలువను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వచ్ఛతపై అవగాహన కల్పించారు.