కాంగోలో ఘోర విమాన ప్రమాదం ఇద్దరు సైనిక అధికారులతో సహా 14 మంది దుర్మరణం

రిపోర్టర్: రాజేష్ స్థలం: కిన్షాసా

ఆఫ్రికా దేశమైన కాంగోలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంజ్ వెల్లడించారు. సైనిక అధికారులతో వెళ్తున్న ఈ విమానం కిక్విట్ నగరం నుంచి కిన్షాసాకు వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తి కేంజ్ ప్రాంతంలో కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో సైనిక న్యాయస్థానాధిపతి ముటోంబో కటలాయి టియెండే, ఆడిటర్ జనరల్ బకుమి లికులియాలతో పాటు మరో 12 మంది సిబ్బంది ఉన్నట్లు వారు పేర్కొన్నారు.