ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్ల తొలగింపుపై దానం ఆందోళన
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
సుప్రీంకోర్టులో దానం నాగేందర్ కు ఎదురుదెబ్బ తగలడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ సెగ్మెంట్ లో దాదాపు లక్షకు పైగా ఓట్లు తొలగించారని దానం నాగేందర్ ఆరోపించారు. ఎస్ఐఆర్ తర్వాత తొలి ఉప ఎన్నిక కావడంతో ఓట్ల తొలగింపుపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఖాయం కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.