ఆత్మకూరులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజ శ్రేయస్సు కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన బాపూజీకి భారతరత్న ఇవ్వాలని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.