కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ సీనియర్ నటి లలితమ్మ కన్నుమూత

రిపోర్టర్: గోపి స్థలం: బెంగళూరు

కన్నడ చిత్ర పరిశ్రమ మరియు నాటక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి లలితమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు మరియు సినీ వర్గాలు తెలిపారు. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా రంగస్థల, టెలివిజన్ మరియు సినీ రంగాలలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. ఆమె మృతి పట్ల పలువురు కన్నడ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.