స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి

రిపోర్టర్: రమేష్ స్థలం: నెల్లూరు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వంద శాతం స్ట్రైక్‌రేట్ సాధించాలని ఆకాంక్షిస్తూ ఇందుకూరుపేట భాజపా మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసులు రెడ్డి శ్రీచాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.