సామాన్యులకు భరోసా కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం
రిపోర్టర్: రాము
స్థలం: Telangana
పోలీస్ స్టేషన్కు వచ్చే సామాన్యుడిలో బెరుకు వీడి తక్షణ న్యాయం జరుగుతుందన్న కొండంత ధైర్యం నింపడమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతోందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజల్లో భద్రతా భావంతో పాటు పోలీస్ వ్యవస్థపై నమ్మకం మరింత పెరిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దిశగా పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.