దీపావళి వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు తెలంగాణ పోలీసుల కీలక సూచనలు

రిపోర్టర్: శివ స్థలం: Telangana

దీపావళి పండుగ వేళ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పటాకులు కాల్చే సమయంలో చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రక్షణ చర్యలు పాటించాలని పేర్కొంటూ తెలంగాణ పోలీస్ శాఖ అధికారికంగా ఒక ముఖ్యమైన భద్రతా సలహా జాబితాను విడుదల చేసింది. పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు.