ఆంధ్రా పేపర్ మిల్స్ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: తూర్పుగోదావరి

రాజమండ్రిలో గోదావరిని కలుషితం చేస్తూ పన్నులు ఎగవేస్తున్న ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2016 నుంచి బకాయి ఉన్న రూ.21.34 కోట్ల పన్నులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ఇకపై ఈ నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.