మైసూర్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: మైసూరు
మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నట్లు ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ తెలిపారు. తన సతీమణి భూమా మౌనిక, పిల్లలతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారని ఆలయ వర్గాలు వెల్లడించాయి. నందమూరి బాలకృష్ణ డాడా సినిమా షూటింగ్ నిమిత్తం మైసూర్ వెళ్లిన ఆయన ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు.