సోలార్ ప్రాజెక్ట్ అడ్డుకోవడంతో దివాలా తీసిన అమెరికా రైతు
రిపోర్టర్: సురేష్
స్థలం: Ohio
అమెరికాలోని ఒహియో రాష్ట్రానికి చెందిన వేన్ గ్రేయర్ అనే రైతు తన భూమిలో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. భారీ వైద్య ఖర్చులు, అప్పుల నుండి బయటపడేందుకు సోలార్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోగా, స్థానిక అధికారులు చట్టం ద్వారా దానిని అడ్డుకున్నారు. ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో ఆదాయం కోల్పోయిన గ్రేయర్ తన భూమిని, యంత్రాలను విక్రయించాల్సి వచ్చిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.