ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ ఒకటో తేదీ ఉదయం నుంచి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ నెల పింఛన్ల కోసం ప్రభుత్వం అరవై ఒక్క లక్షలకు పైగా లబ్ధిదారులను గుర్తించి రెండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. వృద్ధులకు, వితంతువులకు నాలుగు వేలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున లబ్ధిదారుల ఇంటి వద్దనే పారదర్శకంగా అందజేస్తున్నట్లు వారు వెల్లడించారు.