నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యార్థినులకు భద్రతా అంశాలపై అవగాహన సదస్సు

రిపోర్టర్: రాజేష్ స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాల మేరకు పెంట్లవెల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ మరియు ఏహెచ్టీయూ బృందాల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవ్టీజింగ్, పోక్సో చట్టం, ఉమెన్ ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతా నియమాలు మరియు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థినులకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు సూచించారు.