శంషాబాద్లో నకిలీ కరెన్సీ కలకలం: రూ.1.34 లక్షల ఫేక్ నోట్లతో నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: రమేష్ స్థలం: శంషాబాద్

శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామం వద్ద నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్న సందీప్ అనే వ్యక్తిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ వై. సురేందర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.34 లక్షల విలువైన నకిలీ నోట్లతో పాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లిఖిత అనే మహిళ సూచన మేరకే తాను ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడని, ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.