ముంబై రైల్వే స్టేషన్లో కలకలం: టికెట్ తనిఖీలో ఉద్రిక్తత, మహిళ దుస్తులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబైలోని కాందివాలి రైల్వే స్టేషన్లో టికెట్ తనిఖీ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళను చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ప్రియా అంబావడే అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఆమెను పట్టుకునే ప్రయత్నంలో తోపులాట జరిగి మహిళ దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనపై పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలు ఇన్స్పెక్టర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారని వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.