కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ.11,359 కోట్ల పట్టణాభివృద్ధి పనులు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: కుప్పం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాల్టీలు మరియు కార్పొరేషన్లలో చేపట్టనున్న రూ.11,359 కోట్ల విలువైన పట్టణాభివృద్ధి పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.