ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్: 12వ పీఆర్సీ, డీఏల విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, పెండింగ్లో ఉన్న రెండు డీఏలను అక్టోబర్ 1 నుంచి చెల్లించనున్నట్లు ప్రకటించారు. 2022 సరెండర్ లీవ్స్ సంక్రాంతికి, పోలీసులకు దసరాకు అదనపు లీవ్ ఇవ్వనున్నారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్, ఈహెచ్ఎస్ క్రమబద్ధీకరణతో ఖజానాపై రూ. 2,880 కోట్ల భారం పడనుంది. ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశాయి.