కత్తులతో విరుచుకుపడి కంఠాభరణం దోచుకెళ్లిన రాత్రివేళ దొంగల ముఠా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ముమ్మిడివరం

ముమ్మిడివరం మండలం ఠాణేల్లంక పరిధిలోని వడ్డెగూడెంలో శనివారం రాత్రి దోపిడీ దొంగలు తీవ్ర భయాందోళన సృష్టించారు. తోటలోని నివాసంలో ఉంటున్న సానబోయిన దేవేంద్ర ఇంట్లోకి ముగ్గురు దుండగులు చొరబడ్డారు. కత్తులు, ఇంజెక్షన్ సిరంజీలు చూపిస్తూ ప్రాణాలు తీస్తామని భయభ్రాంతులకు గురిచేసి మహిళ మెడలోని మూడు కాసుల బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. స్థానికులు రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు.