ఐరాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఐరాల
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా వీచిన బలమైన ఈదురు గాలుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదుర్కొన్నారు. వేసవి తీవ్రత నుంచి ఉపశమనం లభించినప్పటికీ, ఈ అకస్మాత్తు వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వ్యవసాయ పనులకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.