నంద్యాల జిల్లా యువజన ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
రిపోర్టర్: రమేష్
స్థలం: నంద్యాల
నంద్యాల జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో అయ్యలూరు మెట్టలోని ఎస్.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన నంద్యాల జిల్లా యువజన ఉత్సవాలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతీ యువకుల ఉత్సాహాన్ని, సృజనాత్మకతను తిలకించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు. రేపటి దేశాన్ని నడిపించే సత్తా ఉన్న యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆమె ఈ వేదికగా అభిప్రాయపడ్డారు.