ఢిల్లీ మెట్రో స్టేషన్లో బడ్జెట్ హోటల్: ఆశ్చర్యపోయిన విదేశీ మహిళ

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ మెట్రో స్టేషన్లో అతి తక్కువ ధరకు బడ్జెట్ హోటల్ ఏర్పాటు చేయడం పట్ల బ్రిటన్ పర్యాటకురాలు మియా నికోల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం నాలుగు వందల రూపాయలకే రాత్రి బస సౌకర్యం లభించిందని, గది చాలా శుభ్రంగా ఉందని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. మెట్రో స్టేషన్ లోపల బస చేయడం కాస్త విచిత్రంగా అనిపించినప్పటికీ, తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం సులభంగా దొరకడం ఎంతో ప్రయోజనకరంగా మారిందని ఆమె తెలిపారు.