రోహిణి జైలులో ఖైదీ దారుణ హత్య
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలోని రోహిణి సెంట్రల్ జైలులో ప్రదీప్ అలియాస్ మోహిందర్ అనే ముఫై ఒక్క ఏళ్ల విచారణ ఖైదీని తోటి ఖైదీలు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి దోపిడీ కేసులో జైలులో ఉన్న ప్రదీప్ పై పదికి పైగా కేసులు ఉన్నాయి. బ్యారక్ సమీపంలో జరిగిన ఈ ఘటనపై సమయ్ పూర్ బడ్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.