భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ముందస్తు చర్యలపై అధికారులకు ఆదేశాలు

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితి, సహాయక చర్యలపై ఆయన పలు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణం అనుకూలించి, వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు యంత్రాంగం అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.