జెయింట్ వీల్‌లో జుట్టు చిక్కుకుని మహిళ తీవ్ర గాయాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జాతరలో జెయింట్ వీల్ ఎక్కిన బాలి మారోతి అనే 25 ఏళ్ల యువతి జుట్టు దాని బేరింగ్‌లో చిక్కుకుంది. చక్రం వేగంగా తిరగడంతో ఆమె తల చర్మంలో కొంత భాగం ఊడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే స్పందించి రైడ్ నిలిపివేయగా, బాధితురాలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.