దేశాభివృద్ధికి బాటలు వేస్తున్న ఇంజనీర్ల సేవలు చిరస్మరణీయం

రిపోర్టర్: amudala Venkanna స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని త్రివేణి పాఠశాల శాఖలో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ దేశ పురోగతిలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.