ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పాలు తాగకపోవడానికి గల అసలు కారణం ఏమిటి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Madrid
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన డైట్ లో పాలను ఎందుకు దూరంగా పెడతారనే ఆసక్తికర విషయాన్ని ఆయన మాజీ ప్రైవేట్ చెఫ్ జియోర్జియో బరోన్ వెల్లడించారు. మానవులు ఇతర జంతువుల పాలను తాగడం ప్రకృతి విరుద్ధమని రొనాల్డో భావిస్తారని ఆయన తెలిపారు. చిన్న వయసు దాటిన తర్వాత జంతువుల పాలను తాగడం సహజం కాదని, అందుకే రొనాల్డో డైట్ నుంచి పాలను పూర్తిగా తొలగించారని బరోన్ స్పష్టం చేశారు.