పరిషత్తు పోస్టల్ బ్యాలెట్లలో కూటమిదే పైచేయి: నెల్లూరులో స్పష్టమైన ఆధిక్యం

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

పరిషత్తు ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ల ఫలితాల్లో కూటమి పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిందని ఎన్నికల అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని ముప్ పై మండలాల్లో నిర్వహించిన లెక్కింపులో తెదేపా గణనీయమైన ఓట్లు సాధించగా, వైకాపా వెనుకబడిందని అధికారులు వెల్లడించారు. ఉద్యోగులు చేసిన చిన్న పొరపాట్ల కారణంగా పలు ఓట్లు చెల్లనివిగా మారినట్లు వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉద్యోగుల మద్దతు కూటమి వైపే ఉందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.