అధిక బరువుతో తీవ్ర ముప్పు: పక్షవాత నివారణకు బరువు నియంత్రణ తప్పనిసరి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Hyderabad

అధిక బరువు వల్ల రక్తనాళాలు దెబ్బతిని పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుందని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ విక్రమ్ హుడెడ్ స్పష్టం చేశారు. బరువు నియంత్రణ అనేది కేవలం అందం కోసమే కాకుండా, బ్రెయిన్ స్ట్రోక్ నివారణలో భాగం కావాలని ఆయన తెలిపారు. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచుకుంటూ తగిన బరువును కాపాడుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.