ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సన్నాహక భేటీ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: హైదరాబాద్

రాబోయే ఎమ్మెల్సీ మరియు మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో ఉన్నత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ఉద్యమ రూపంలో చేపట్టాలని, ఈ నెల 27న ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.