బ్రిక్స్ సమ్మిట్ భోజనంపై రాహుల్ గాంధీ, కిరెన్ రిజిజు వివాదం
రిపోర్టర్: మహేష్
స్థలం: New Delhi
బ్రిక్స్ సమ్మిట్ విందులో శాఖాహార మెనూపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దేశంలో 80 శాతం మంది మాంసాహారులేనని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆహారపు అలవాట్లపై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. భారతీయ శాకాహార వంటకాలు ఎంతో రుచికరమైనవని, విదేశీ అతిథులు వాటిని ఆస్వాదించారని రిజిజు స్పష్టం చేశారు.