జర్నలిస్ట్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బి కృష్ణారావు నియామకం
రిపోర్టర్: andluri ganesh
స్థలం: గజపతినగరం
గజపతినగరం ప్రాంతానికి చెందిన బి కృష్ణారావును ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పి శివ ప్రసాద్ నియమించారు. విజయనగరం లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.