నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా జాబ్స్ దరఖాస్తు గడువు పెంపు

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్స్, క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించినట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 1, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,100 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.