విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా యువత ఆందోళన
రిపోర్టర్: సతీష్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం బీచ్ రోడ్డులో జెన్ జెడ్ యువత మరియు స్థానిక పౌరులు స్టాప్ వైజాగ్ డేటా సెంటర్ పేరుతో నిరసన చేపట్టారు. డేటా సెంటర్ మాకొద్దు అంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇది శాంతియుత నిరసన అని చెబుతున్నప్పటికీ, ఆందోళనను అడ్డుకున్న పోలీసులతో యువత వాగ్వాదానికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.