ఖమ్మంలో విషాదం: ఆటలాడుతూ కుప్పకూలి బాలుడు మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఖమ్మం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఉదయం ఆటలాడుతూ ఎనిమిదో తరగతి విద్యార్థి సలిగంటి సాత్విక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.