ప్రపంచ కప్ టోర్నీ వివాదం: లీగల్ యాక్షన్ తీసుకోనున్న శిఖర్ ధావన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ప్రపంచ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా టోర్నీలో తన పేరును వాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలను ఖండించిన ఆయన, అభిమానులు ఎవరూ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తన ప్రమేయం లేకున్నా జాబితాలో పేరు చేర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.