'మహాశివరాత్రి నాటికి సోమేశ్వరాలయం పూర్తి చేస్తాం': అధికారుల స్పష్టీకరణ

రిపోర్టర్: సురేష్ స్థలం: అనంతసాగరం

సోమశిల జలాశయం వద్ద వరదలకు దెబ్బతిన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం రూ.22 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. స్వయంభు లింగానికి భంగం కలగకుండా చెన్నై నల్లరాతితో ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. మహాశివరాత్రి నాటికి ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.