పర్యావరణాన్ని కాపాడుతూ భక్తిని చాటాలని కోరిన అందే వెంకటేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హెచ్ఆర్పీసీఐ తిరుపతి జిల్లా చైర్మన్ అందే వెంకటేష్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ పీవోపీ విగ్రహాలతో జల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతికి హాని చేయని సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలనే వాడాలని ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రసాయన రంగుల వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా మట్టి ప్రతిమలతోనే పూజలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.