ఈడీ ఉచ్చులో గ్రూప్-1 అక్రమాలు: తెలుగు రాష్ట్రాల్ లో విస్తృత సోదాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్/అమరావతి

వైకాపా హయాంలో జరిగిన గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన అక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ లోని పలు ప్రాంతాల్ లో ఈడీ సోదాలు నిర్వహించింది. మాజీ ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులుతో పాటు ఆయన మిత్రుల నివాసాలు, సంబంధిత మీడియా సంస్థల కార్యాలయాల్ లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది.