కామాఖ్య అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వినోద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందమర్రి
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి కామాఖ్య అమ్మవారి ఆలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.