పోలీస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
ట్యాంక్ బండ్ వద్ద కేసీఆర్ పాటలు పెడితే కేసులు పెడతామన్న సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారుల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ నిలదీస్తామని స్పష్టం చేస్తూ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.