మలయాళంలో కొత్త సినిమా పిక్నిక్ ప్రకటనతో పాటు విడుదల తేదీ వెల్లడి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కేరళ

ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థ బెత్లహేమ్ కుడుంబ యూనిట్ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న తరుణంలో, మేకర్స్ తమ తదుపరి చిత్రాన్ని పిక్నిక్ పేరుతో ప్రకటించారు. కిరణ్ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్, దిలీ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027 జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.