నెల్లూరుకు చేరుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అలపాటి సురేష్ కుమార్ మూడు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరుకు చేరుకున్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో సమాచార శాఖ డీడీ వేణుగోపాల్ రెడ్డి, పీఆర్వో వినోద్, ఏవీఎస్ ప్రసాద్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ నెల 5వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న గ్రామీణ పాత్రికేయుల రిఫ్రెషర్ తరగతుల్లో చైర్మన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సిబ్బంది మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.