నగరి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన అధికారులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
నగరి మున్సిపాలిటీ పరిధిలోని నలభై వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రజల పరిశీలనార్థం ప్రదర్శించారు. మున్సిపల్ కార్యాలయంతో పాటు సచివాలయాల్లో జాబితాలను అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ బాలాజినాయక్ తెలిపారు. మొత్తం నలభై వార్డుల్లో నలభై ఎనిమిది వేల మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. జాబితాలో వివరాలు సరిచూసుకోవాలని ప్రజలకు సూచించారు.