మహిళల రక్షణే ధ్యేయంగా సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లు
రిపోర్టర్: సునీల్
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
మహిళలు మరియు పిల్లల భద్రత కోసం నిర్వహించిన వివిధ ప్రత్యేక ఆపరేషన్లలో అనేక మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. మొత్తం నూటఒకటి డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి యాభై ఐదు మంది నిందితులను పట్టుకుని నలభై ఎనిమిది పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఆధ్వర్యంలో ముగ్గురు బాధితులను రక్షించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముప్పై రెండు కుటుంబాలను ఒకరినొకరు కలిపి సురక్షితంగా పునరేకీకరణ చేయడంతో పాటు రెండు వేల నూట ముప్పై ఎనిమిది మందికి అవగాహన సదస్సులు నిర్వహించినట్లు స్పష్టం చేశారు.