బాచుపల్లిలో మూడేళ్ల సంబరం: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద వేడుకలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి
బాచుపల్లిలో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు సొంతింటి కల సాకారమై మూడేండ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకున్న వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసినట్లు కె.పి. వివేకానంద - ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిరుపేదల గూడు కల్పనపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేయగా, వారి ఆనందంలో తాను భాగస్వామినైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.