'సౌదీకి సైనిక మద్దతు లేదు': హౌతీలతో రహస్య భేటీపై అమెరికా సంచలన నిర్ణయం

రిపోర్టర్: రమేష్ స్థలం: World

మిత్రదేశం సౌదీ అరేబియాకు అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. హౌతీ రెబల్స్‌తో ఒమన్‌లోని మస్కట్‌లో రహస్యంగా సమావేశమైన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం, హౌతీల దూకుడును అడ్డుకోవడానికి సౌదీకి ఎలాంటి ప్రత్యక్ష సైనిక మద్దతు ఇవ్వరాదని నిర్ణయించింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సైనిక సహాయం కోరినప్పటికీ, హౌతీలతో జరిపిన చర్చల నేపథ్యంలో ట్రంప్ సర్కార్ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. అమెరికా నౌకలపై దాడి చేయబోమని హౌతీ నేతలు మహ్మద్ అబ్దుల్ సలాం, అబ్దుల్ మాలిక్ అల్ అజిరి హామీ ఇవ్వడంతో, ఈ పరిణామం సౌదీ అరేబియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.