హైదరాబాద్ లో భారీ దొంగతనాలు గుట్టురట్టు: అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు అరెస్ట్

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పదమూడు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారని హైదరాబాద్ సిటీ పోలీస్ వెల్లడించారు. నిందితుడి నుంచి ముప్ పై ఎనిమిది తులాల బంగారం, డెబ్బై తులాల వెండితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దొంగతనాలపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.