బెంగళూరు విమానాశ్రయంలో త్వరలో సరికొత్త హోమ్ చెక్-ఇన్ సేవలు!

రిపోర్టర్: వెంకట్ స్థలం: కర్ణాటక

ప్రయాణికుల సౌలభ్యం కోసం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కీలక నిర్ణయం తీసుకుంది. 'కేర్ బై బిఎల్‌ఆర్' కార్యక్రమంలో భాగంగా ఇంటివద్దనే లగేజ్ సేకరించే హోమ్ చెక్-ఇన్ సేవలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానం ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా విమాన ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.