సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ కొత్త సినిమా తెరకెక్కనున్నట్లు ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించకుండా తన టీమ్ లోని యువ దర్శకుడికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తుండగా, ఇప్పటికే వరుణ్ తేజ్ అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.